భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం 

భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం - భారత్–భూటాన్ మైత్రి బంధానికి కొత్త ఊపు భూటాన్, నవంబర్ 11 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనకు చేరుకున్నారు. భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే భూటాన్ ప్రధాన మంత్రి షేరింగ్ టోబ్గే స్వయంగా ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు. రెండు దేశాల జెండాలు రెపరెపలాడుతుండగా, గౌరవ వందనాలతో మోదీకి రాజసమాన ఆతిథ్యం అందించారు. భూటాన్ ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో రోడ్ల వెంట నిలబడి “లాంగ్ లివ్ ఇండియా–భూటాన్ ఫ్రెండ్షిప్” అంటూ...