రాజానగరం ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ మృతి పట్ల సంతాపం
తునిలో చివరి దర్శనానికి మంత్రి అనిత వంగలపూడి హాజరుపిల్లల విద్యాభాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలుతుని, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):రాజానగరం పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోత్స్నభాయ్ ఆకస్మిక మరణం పాలిట కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ప్రాంతీయ విద్యా వర్గాలను, స్థానిక ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన కుటుంబానికి ఇది మరొక పెద్ద దెబ్బగా మారింది. తునిలో జరిగిన చివరి దర్శన కార్యక్రమానికి మంత్రి అనిత వంగలపూడి హాజరై పుష్పాంజలి ఘటించారు. ఆమె...