బాలయ్య వివాదానికి పుల్‌స్టాప్..

హైదరాబాద్, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):  హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ఒక చిన్న ఎమోజీ పోస్ట్ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కు కారణమైంది. దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెబుతూ, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను కోరారు. బాలయ్య అభిమానులు కూడా ఆయన వివరణతో శాంతించారు. సీవీ ఆనంద్ తన తాజా పోస్టులో రెండు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తుచేస్తూ, ఒక...