యాపిల్‌ సేల్స్‌ విభాగంలో ఉద్యోగుల కోత

హైదరాబాద్‌, నవంబర్‌ 25, మనప్రజాప్రతినిధి:ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ రంగం ఆర్థిక ఒత్తిడులతో కుదేలవుతున్న వేళ, ప్రముఖ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి అనేక సంస్థలు విడతలవారీగా ఉద్యోగాల కోతకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే వరసలో తాజాగా యాపిల్‌ కూడా చేరింది.బ్లూమ్‌బర్గ్‌ వెలువరించిన వివరాల మేరకు, యాపిల్‌ తన సేల్స్‌ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కోత పరిమితంగానే ఉండనున్నట్లు సమాచారం. అమ్మకాల విభాగంలో వ్యూహాత్మక...