manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 2:14 pm Editor : Mana Praja Prathinidhi

మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

సత్తుపల్లి//మనప్రజాప్రతినిధి న్యూస్ నవంబర్18:

ఖమ్మం డిపిఇఓ  నాగేద్ర రెడ్డి ఆదేశానుసారం,సత్తుపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి  ఆధ్యర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ను  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  శాంతి నికేతన్ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఎక్సైజ్ ఎస్.ఐ శేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం అధికమైనా మరియు వ్యసనపరులైనా వివిధ మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక మరియు శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఇది  ఇప్పుడు తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది, ఇది వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ఆగస్టు 15, 2020న నషా ముక్త్ భారత్ అభియాన్ (యన్.ఎం.బి.ఎ)ను ప్రారంభించింది. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా  నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం, అనంతర సంరక్షణ, ప్రజా సమాచార వ్యాప్తి మరియు సమాజ అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. యువత ఎక్కువగా ఏదో సరదాగా, స్నేహితుల ప్రోద్బలంతో  స్టార్ట్ అయిన మాదక ద్రవ్యాలు తర్వాత వ్యసనంగా మారుతుందని , ఇది వ్యక్తిని శారీరకంగా ,మానసికంగా మరియు సామాజికంగా క్షీణింపచేస్తుంది, మాదక ద్రవ్యాలు నిరోధించేందుకు  చట్టాలు చాలా కఠినం గా ఉన్నాయని ఒకసారి  ఎన్ డిపిఎస్ యాక్ట్ లో కేసు నమోదు ఐతే భవిష్యత్తు లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు అందుకే విద్యార్థులు , యువత మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. ప్రిన్సిపాల్ మమన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు ఎటువంటి వ్యసనాలకూ లోను కాకుండా చదువు పై దృష్టి పెట్టి , ఉన్నత స్థాయిలో నిలిచి తల్లిదండ్రులకి,  కళాశాలకి మంచి పేరు తీసుకురావాలి అని తెలిపారు. తర్వాత మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా సామూహిక ప్లెడ్జ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది , కళాశాల కరస్పాండెంట్,లెక్చరర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.