చవక రీచార్జ్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి సెన్సేషన్.. <br>– రోజుకు కేవలం ₹6.74కే 72 రోజుల ప్లాన్<br>

న్యూఢిల్లీ, నవంబర్ 23 మనప్రజాప్రతినిధి: ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు రోజురోజుకు పెరుగుతుండగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తన చవక ప్లాన్‌లతో మళ్లీ మార్కెట్‌ను ఊపేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.కస్టమర్ల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా వరుసగా కొత్త ఆఫర్లు తీసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్,...