manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 9:00 am Editor : Mana Praja Prathinidhi

ప్రమాదాల నివారించడానికి చర్యలు తీసుకోండి బీఎస్పీ

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట గురువారం 20

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. అలాగే రోడ్డు గుంతలు పడి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గజ్జల తిరుపతి మౌర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ల నరేష్, అసెంబ్లీ ఇంచార్జ్ పంగా బాబు, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆశని కనక ప్రసాద్ నాయకులు, మైల తిరుపతి, ఎనగందుల శంకర్ గార్లు పాల్గొన్నారు.