మానసిక ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ సందేశం
- సహాయం కోరడం బలహీనత కాదు బాధ్యత- అవగాహనతోనే అపహాస్యానికి ముగింపు(హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమన్న విషయాన్ని తెలంగాణ పోలీస్ బలంగా చాటింది. సమాజంలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఈ సమస్యలను తగ్గించుకోటానికి ముందుకొచ్చేలా ప్రోత్సాహించే దిశగా ఈ సందేశాన్ని విడుదల చేశారు. ప్రతి వ్యక్తి మానసికంగా బలంగా ఉండటం ద్వారా కుటుంబాలు, పాఠశాలలు, కార్యాలయాలు మరియు మొత్తం సమాజం మరింత సురక్షితంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు.ప్రజలు...