manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 3:58 pm Editor : Mana Praja Prathinidhi

రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సందడి

– రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా అవార్డు వేడుక
– తెలంగాణ సీఎం రేవంత్ , ఏపీ సీఎం చంద్రబాబు హాజరు
– రామోజీ గ్రూప్ సేవలను నేతలు ప్రశంస

హైదరాబాద్, 16 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవవంతం చేశారు.
రామోజీ గ్రూప్ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. జర్నలిజం, వినోద రంగాల్లో అందిస్తున్న ప్రమాణాలు సమాజానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ఇటువంటి వేదికలు మరింతగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్బంగా అభినందనలు తెలియజేశారు. విశ్వసనీయత, నాణ్యత, సరికొత్త ఆవిష్కరణలతో రామోజీ సంస్థలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సినీ-మీడియా రంగ ప్రతినిధులు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.