బండ్ల గణేష్ వ్యాఖ్యలకి ఎస్‌కేఎన్ కౌంటర్…
హైదరాబాద్,నవంబర్13 (మనప్రజాప్రతినిధి ): ఈ మధ్య సినీ ఈవెంట్లలో సెలబ్రెటీలు మాట్లాడే మాటలే పెద్ద కాంట్రవర్సీలకు కారణమవుతున్నాయి. స్టేజ్‌పై భావోద్వేగంతో లేదంటే ఉత్సాహంతో పలువురు నటులు, నిర్మాతలు మాట్లాడే మాటలు విమర్శలకి కారణమవుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన సినిమా మాఫియా గురించి బహిరంగంగా మాట్లాడడమే కాకుండా, మెగా నిర్మాత అల్లు అరవింద్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఈవెంట్‌లోనే నిర్మాత బన్నీ వాసు కౌంటర్ ఇవ్వడంతో గణేష్...