విజయ్ దేవరకొండ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక
హైదరాబాద్,నవంబర్13 (మనప్రజాప్రతినిధి ): రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలానే తన మాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చూశాను. చాలా సార్లు కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. ఇది నేను ఇటీవల చూసిన...