మనప్రజాప్రతినిధి//సిద్దిపేట అర్బన్, నవంబర్18:
ఈ మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది
సిఐటియు జిల్లా నూతన అధ్యక్ష లుగా సందబోయిన ఎల్లయ్య కార్యదర్శిగా కాముని గోపాలస్వామి కోశాధికారిగా గొడ్డు బర్ల భాస్కర్ ఎన్నికసిద్దిపేట అర్బన్:- సిఐటియు సిద్దిపేట జిల్లా నాలుగో మహాసభలు విజయవంతంగా జరిగాయని ఈ మహాసభల విజయవంతానికి సహకరించిన కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు అని సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి తెలిపారు. సోమవారం రోజున కార్మిక కర్షక భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా సిఐటియు నాలుగో మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించామని తెలిపారు సిద్దిపేట జిల్లాలో మూడున్నర లక్షల మంది సంఘటితంగా కార్మికులు ఉన్నప్పటికీ వారి పీఎఫ్ ఈఎస్ఐ కటింగ్ డబ్బులు అవుతున్న వారి ఆరోగ్య సమస్యలు కార్యాలయ సమస్యలు పరిష్కారం కావడానికి సిద్దిపేటలో లేకపోవడం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ఈఎస్ఐ డిస్పెన్సరీ సెంటర్లో ఏర్పాటు చేయాలని మాసభ డిమాండ్ చేసింది స్కీం వర్కర్లుగా ఉన్న ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఐకెపి వివో లు ఆర్పీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని మహాసభ డిమాండ్ చేసింది అసంఘటితరంగా కార్మికులైన హమాలీ ట్రాన్స్పోర్ట్ బీఈడీ భవనిర్మాణ కార్మికులకు సమగ్రమైన చట్టం చేసి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు వారి కుటుంబాలకు విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలని కుటుంబాలకు భరోసానిచ్చే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి ప్రభుత్వమే పెన్షన్ 10000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రమాదవశాస్తు మరణిస్తే వారికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ మహాసభ డిమాండ్ చేసింద వీటితోపాటు విద్యుత్తు ప్రైవేటీకరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని అందుకని విద్యుత్ ప్రకృతికలను కార్మిక వర్గంతో పాటు రైతులు ప్రజలు విద్యుత్ సంస్కరణ బిల్లుకు వ్యతిరేకంగా కలిసి రావాలని మహాసభ కోరింది కార్మిక హక్కులను హరించే విధంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దుపరిచి 29 చట్టాలను తిరిగి తీసుకురావాలని మహాసభ డిమాండ్ చేసింది. ఈ తీర్మాన అమలు కోసం రాబోయే కాలంలో పోరాటాలను ఉదృతం చేస్తామని మహాసభ నిర్ణయం చేసింది అన్నారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన జిల్లా కమిటీ 41 మందితో ఎన్నిక నూతన అధ్యక్షులుగా సందబోయిన ఎల్లయ్యకార్యదర్శిగా కాముని గోపాలస్వామికోశాధికారిగా గొడ్డు బర్లభాస్కర్ఉపాధ్యక్షులుగా:- శెట్టిపల్లి సత్తిరెడ్డి, ఎం పద్మ, బండ్ల స్వామి, కాట మధు, సింగిరెడ్డి చంద్రారెడ్డి.సహాయ కార్యదర్శిలుగా:- చొప్పరి రవికుమార్, తునికి మహేష్, ఇప్పకాయల శోభ, మామిడాల కనకయ్య, చన్ రాజు బాల్ లక్ష్మి, ప్రవీణ, ఒకరు కో ఆప్షన్. మరో 26 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.