మనప్రజాప్రతినిధిన్యూస్,సత్తుపల్లి నవంబర్17:
కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాగులు కేటాయించి సంస్థను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం నాడు జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో భాగంగా సింగరేణి గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకురావడంతో అనేక మంది యువత సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు పొందారని గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇండిపెండెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంలో విఫలమైందని వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంత ఇంటి కలను నెరవేర్చాలని సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ఏర్పాటుతోపాటు హైదరాబాదులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని తద్వారా కార్మికుల కు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని సింగరేణి సంస్థకు టెండర్ వేలం లేకుండా బొగ్గు బ్లాగులను కేటాయించాలని కోరారు.