manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 12:40 pm Editor : Mana Praja Prathinidhi

ఎన్నికల సమయాన మహిళలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మన ప్రజాప్రతినిధి
అక్బర్‌పేట్–భూంపల్లి మండలం, సిద్దిపేట జిల్లా
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజలా కవిత శ్రీనివాసగౌడ్
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని కవిత శ్రీనివాసగౌడ్ ప్రెష్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్‌పీపీ పంజలా కవిత శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహిళలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీచేసిందని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళా సంఘ సభ్యులకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పడం మహిళలను మోసం చేసే కుట్రేనని విమర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన తెలిపారు“మహిళలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. మహిళలకు నెలకు ₹2500 ఇస్తామని చెప్పారు… ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు.విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు…కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.”అలాగే పంచాయతీఎన్నికలుదగ్గరపడుతున్నాయనే కారణంతో ఇందిరమ్మ చీరలు మహిళా సంఘ సభ్యులకు మాత్రమే ఇస్తామని చెప్పడం ద్వారా మిగతా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
అయన ప్రశ్నించారు
“మిగతా మహిళలకు ఓట్లు లేవా? 18 ఏళ్లు నిండిన మహిళలు ఓట్లు వేయరా? ప్రతి మహిళ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తోంది.