గ్యాస్ ఛాంబర్‌లా ఢిల్లీ… సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు

కాలుష్య తీవ్రతతో ప్రభుత్వ అత్యవసర చర్యలుప్రైవేట్ కంపెనీలకు కొత్త గైడ్‌లైన్స్ అమలు నిరసనల మధ్య పోలీసుల కఠిన చర్యలుఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు దారుణంగా పడిపోతుండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. చలికాలం ప్రారంభమైన వెంటనే నగరం మళ్లీ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయిందని పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి. PM2.5, PM10 మోతాదులు నిర్ణీత పరిమితిని బాగా దాటి నమోదు కావడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986లోని సెక్షన్ 5...