షాపుల ముందు ధర్నా

మనప్రజాప్రతినిధి// అక్కన్నపేట, నవంబర్ 22:సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్లో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాపు యజమానులు ఉద్దెర ఇవ్వడం వల్ల, తమకు వచ్చిన కూలి పంట డబ్బులు కూడా అటే వెళ్ళిపోతున్నాయని తెలియజేశారు. ఈ విషయం పై ఎక్స్చేంజ్ అధికారులకు విన్నవిస్తే, కనీసం పట్టించుకోవడం లేదన్నారు....