విజయానికి వికలాంగత అడ్డు కాదు
సవ్యాంగులకు దీటుగా దివ్యాంగుల ప్రతిభ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంగారెడ్డి, నవంబర్ 29:,(మనప్రజాప్రతినిధి):దివ్యాంగులు సవ్యాంగులకు దీటుగా అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మహిళా, శిశు,వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య క్రీడాపోటీలనుప్రారంభించిపాల్గొన్నవారికిశుభాకాంక్షలుతెలియజేశారు.ఈసందర్భంగాకలెక్టర్మాట్లాడుతూ,దివ్యాంగులు సవ్యాంగులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో అద్భుత...