manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:11 pm Editor : Mana Praja Prathinidhi

ఒక్క పరాజయంతో కుంగిపోకండి… భవిష్యత్తు బీజేపీదే

– ఉపఎన్నిక ఫలితాలపై ఈటల రాజేందర్ స్పందన
– డివిజన్ పాలిటిక్స్‌తో అధికారం సాధ్యం కాదని వ్యాఖ్య
– అభివృద్ధి-ఆత్మగౌరవమే బీజేపీ విజయ రహస్యం అని ఈటల అభిప్రాయంహైదరాబాద్, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్, ఒక్క ఓటమి వచ్చినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమని, భవిష్యత్తులో బీజేపీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. డివిజన్ పాలిటిక్స్ ఆధారంగా తెలంగాణలో అధికారం సాధ్యం కాదని, కులం-మతం ఆధారిత రాజకీయాలు శాశ్వతంగా నిలవవని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఎదగనిచ్చిందంటే అభివృద్ధి-సంక్షేమం అందరికీ అందినందువల్లేనని చెప్పారు. తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ఉదాహరణలను ప్రస్తావించిన ఈటల,
నారాయణఖేడ్, హుజూర్నగర్, పాలేరు, నాగార్జునసాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి చోట్ల అధికార పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలవడం ధర్మం గెలుపుగా అభివర్ణించారు. “కేసీఆర్ అహంకారం అణచడానికి ప్రజలు దుబ్బాకలో బీజేపీకి నిలబడ్డారు” అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టినా గెలిచిందని, అటువంటి సమయంలో కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పారు. “బీజేపీ గెలిస్తే ఇవీఎంలను మేనేజ్ చేశారని అంటారు… మరి మీరు గెలిస్తే అవే ఇవీఎంలా?” అంటూ విమర్శించారు. బీహార్ ఎన్నికల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట 25 ఏళ్ల మైథిలీ ఠాగూర్ విజయం, బీజేపీకి అందరి మద్దతు ఉందని నిదర్శనమని ఈటల వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘సబ్ కా సాత్ – సబ్ కా విశ్వాస్ – సబ్ కా వికాస్ – సబ్ కా ప్రయాస్’ అనే నినాదమే బీజేపీ సిద్ధాంతమని అన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు చేసిన పనులు, ఇక ముందు చేయబోయే కార్యక్రమాలు చెప్తూ నమ్మకం కలిగించడమే నిజమైన రాజకీయమని ఈటల సలహా ఇచ్చారు. “బరిగీసి కొట్లాడే తత్వం లేకపోతే పార్టీ ఎదగదు” అని కార్యకర్తలకు హితవు పలికారు.

హైదరాబాద్, 17 నవంబర్ (మనప్రజాప్రతినిధి):