manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 12:56 pm Posted by : Mana Praja Prathinidhi

వడ్ల కుప్పలకు తగిలి ఆటో బోల్తా డ్రైవర్ మృతి

మెదక్ //మనప్రజాప్రతినిధి,నవంబర్ 17

బీటీ రోడ్డుపై వడ్ల కుప్పలు  నిర్లక్ష్యంగా వేయడంతో అటుగా వెళుతున్న ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్  అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గం ఎస్సై శంకర్ కథనం ప్రకారం పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామానికి చెందిన హమ్మద్ హుస్సేన్ ( 57) ఆటో బోల్తా పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తన సొంత ఆటో నెంబర్ ఏపీ 23 w 9396 గల దానిలో పెద్ద శంకరంపేట నుండి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో  ప్యాసింజర్ ను ఎక్కించుకొని మండల కేంద్రమైన అల్లాదుర్గం లోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు ఈ ఆటో డ్రైవర్ హమ్మద్ హుస్సేన్ తీసుకువచ్చారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రాత్రి 9:30 ప్రాంతంలో స్వగ్రామమైన కోలపల్లికి అహ్మద్ హుస్సేన్ ఆటో నడుపుకుంటూ ఒక్కడే పోవుచుండగా రాంపూర్ గ్రామ శివారులో రోడ్డుపై వరి ధాన్యం నిర్లక్ష్యంగా వేయడంతో ఈ ఆటో వరి కుప్పలకు తగిలి బోల్తాపడడంతో ఆటోలో ఉన్న మహమ్మద్ హుస్సేన్ ఆటో కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. రాంపూర్  161 జాతీయ రహదారి ప్రక్కన స్లీప్ రోడ్డులో రాంపూర్ గ్రామానికి చెందిన చెట్టు కింద పాపయ్య వడ్ల కుప్పలను నిర్లక్ష్యంగా  వేయడంతో అటుగా వెళుతున్న ఆటో వరికుప్పలకు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుని కుమారుడు జావిద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు సోమవారం శవ పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.