manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:47 pm Editor : Mana Praja Prathinidhi

అజిత్‌సింగ్‌నగర్‌లో ఈగిల్ సైకిల్ ర్యాలీ

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు
ఐజీ ఎ.కె. రవికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ
ఆరోగ్యం–క్రమశిక్షణపై ప్రజల్లో అవగాహన

విజయవాడ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు “డ్రగ్స్‌కు నో బ్రో – సైకిల్ తొక్కు బ్రో” అనే నినాదంతో అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈగిల్ విభాగం ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీకి ఈగిల్ విభాగాధిపతి, ఐజీ ఎ.కె. రవికృష్ణ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం కోసం సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని సందేశమిచ్చారు. డ్రగ్‌ వ్యసనంతో కుటుంబాలు, సమాజం ఎదుర్కొంటున్న నష్టాలను అరికట్టేందుకు ఈగిల్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతం ప్రజలు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని ర్యాలీకి ఆత్మీయంగా స్పందించారు