ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి.ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
మన ప్రజాప్రతినిధి – రాజన్నసిరిసిల్ల. నవంబర్ 28గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు చేసే వ్యయాన్ని పూర్తిస్థాయిలో, పారదర్శకంగా నమోదు చేయాలని ఇంచార్జికలెక్టర్,జిల్లాఎన్నికలఅధికారిగరిమఅగ్రవాల్ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారంనిర్వహించిన సహాయ వ్యయ పరిశీలకుల (AEOs) శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో వ్యయ పర్యవేక్షణ అత్యంత కీలకమని, ప్రతి అభ్యర్థి తన ఖర్చులను రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఆమెతో పాటు వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్, నోడల్ అధికారి శేషాద్రి కూడా ఎన్నికల ఖర్చుల నియంత్రణపై సూచనలు అందించారు.వ్యయ పరిమితులు...