రకుల్ పేరుతో నకిలీ వాట్సాప్ కలకలం.. <br>– “ఆ నంబర్ నాది కాదు.. వెంటనే బ్లాక్ చేయండి”

ముంబయి, నవంబర్‌ 25,మనప్రజాప్రతినిధి:సోషల్ మీడియా విస్తరణతో పాటు సైబర్ మోసగాళ్ల చలాకీతనం కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఓ నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ఘటన బయటపడింది. కొంతమంది కేటుగాళ్లు ఆమె ఫోటోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకుని, బయోలో ఆమె నటించిన సినిమాల పేర్లు చేర్చి నమ్మకం కలిగించేలా ప్రయత్నించారు. 8111067586 అనే నంబర్ ద్వారా పలువురికి రకుల్ పేరుతో సందేశాలు పంపినట్లు సమాచారం.ఈ విషయం తన దృష్టికి రాగానే...