manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 1:57 pm Editor : Mana Praja Prathinidhi

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచుల చేరిక

మనప్రజాప్రతినిధి//మానకొండూర్.నవంబర్ 30
ఇల్లంతకుంట మండలం సోమరంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు కందారం వెంకట చారి, కాసం శ్రీనివాస్ రెడ్డి, అలాగే యువ నాయకులు గైని నరసయ్య గౌడ్, దుద్దెడ భరత్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూపార్టీబలోపేతానికి నాయకులచేరికలునూతనోత్సాహాన్నినింపుతున్నాయనిపేర్కొన్నారు.కార్యక్రమంలోరాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిద్ధం వేణు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు చెరుకుపల్లి రాజిరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు.