వైరాలో యంగ్ ఇండియా సమగ్ర నివాస పాఠశాల శంకుస్థాపన
20 ఎకరాల్లో 200 కోట్లతో అత్యాధునిక విద్యా ప్రాజెక్ట్ప్రతి నియోజకవర్గంలో ఒక సమగ్ర పాఠశాల లక్ష్యంవిద్యార్థుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యంఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కవైరా, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమగ్ర నివాస పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమనే దృక్పథంతో ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. వైరాలో నిర్మిస్తున్న ఈ పాఠశాల భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, తెలంగాణ...