అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు శుభారంభం
సదాశివపేట, నవంబర్ 26 (మన ప్రజా ప్రతినిధి)సదాశివపేట మండలం గొల్లెగూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను బుధవారం సాయంత్రం టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాటికశాల జోగయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, “పేదవారి కోసం సేవ చేయాలనే ఆలోచనతో ఫౌండేషన్‌ను స్థాపించడం ఎంతో గొప్ప పని. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే అమ్మ ఫౌండేషన్ ముఖ్య...