జహీరాబాద్, నవంబర్ 28 (మన ప్రజా ప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి. నరేష్ సూచించారు.ఎన్నికల సమయంలో ₹50,000 కంటే ఎక్కువ నగదు లేదా విలువైన వస్తువులను సరైన ధృవపత్రాలు లేకుండా తీసుకెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేని నగదు, విలువైన వస్తువులను పోలీసులు జప్తు చేస్తారు. అవసరమైన ధృవపత్రాలు చూపించిన తర్వాత మాత్రమే వాటిని తిరిగి అందజేస్తామని చెప్పారు.ప్రచారంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని కోహిర్ ఎస్సై టి. నరేష్ ఆకాంక్షించారు.