manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 11:57 am Editor : Mana Praja Prathinidhi

76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూంపల్లి గ్రామంలో ఘనంగా నివాళులు<br>

మన ప్రజా ప్రతినిధి //సిద్దిపేట జిల్లా //అక్బర్పేట్–భూంపల్లి మండలం / నవంబర్ 26

అక్బర్పేట్–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ ప్రతిపాదకుడు మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్, భూంపల్లి గ్రామ ముద్దుబిడ్డ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ—
“బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి నడుచుకోవాలి. ఆయన చేసిన సేవలకు మన సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అంబేద్కర్ గారు కలగన్న సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి వ్యక్తి ఆచరణలో పెట్టాలి” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, దళిత–బహుజన సంఘాలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగం వర్ధిల్లాలి – జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.