manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 10:47 am Editor : Mana Praja Prathinidhi

ఎముకలు కోరికే చలిలో గజ గజ మంటున్న హాస్టల్ విద్యార్థులు 

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి:

  హాస్టల్ విద్యార్థులకు అందని స్వెటర్లు,దుప్పట్లు అధికారుల పర్యవేక్షణ లేక హాస్టల్ వార్డెన్ల ఇష్టారాజ్యం యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ హాస్టల్ విద్యార్థులు చన్నీటి స్నానాలతో స్నానం చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నరని రాష్ట్ర ప్రభుత్వం హీటర్ సౌకర్యాలు కల్పించాలని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన  మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం సమర్పించి  మాట్లాడుతూ.మెదక్ జిల్లా 21 మండల కేంద్రాలలో ఉన్న హాస్టల్  విద్యార్థులు హాస్టల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దుప్పట్లు స్వెటర్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వార్డెన్లకు ఇష్టరాజ్యం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేలపైన పడుకుంటున్నారని చలిలో వణుకుతూ భయనికి గురవుతున్నారని ఆయన అన్నారు ఇంటి నుంచే దుప్పట్లు సామాగ్రితెచ్చుకుంటున్నారని కనీసం విద్యార్థుల పట్ల అధికారులు మాత్రం కనికరం చూపడం లేదని ఆయన అన్నారు కిటికీలు లేకపోవడం డొర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు వణుకుతూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెనువెంటనే హాస్టల్ విద్యార్థులకు సామాగ్రిని పంపిణీ చేయాలని లేని పక్షంలో జిల్లా వెల్పర్స్ ఆఫీసులు ముట్టడి  చేపడతామని ఆయన హెచ్చరించారు

           ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు   కృష్ణ పాల్గొన్నారు