ఇల్లంతకుంట ఎస్సై హెచ్చరిక: నిరుద్యోగులు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసానికి గురికావద్దు

మన ప్రజాప్రతినిధి//మనకొండూరు, //నవంబర్ 27 –ఇల్లంతకుంట మండల పరిధిలోని గ్రామాల్లో నిరుద్యోగ యువకులు పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు నకిలీ వీసాలు మరియు మాయా మాటలతో నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతోందని ఇల్లంతకుంట సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) సిరిసిల్ల అశోక్ హెచ్చరించారు.ఎస్సై అశోక్ వివరాల ప్రకారం, నకిలీ ఏజెంట్లు యువకులను రెండు–మూడు నెలల టూరిస్ట్ వీసాలు చూపించి డబ్బులు తీసుకుంటారు. తర్వాత వారిని అసహాయ పరిస్థితుల్లో, రూమ్ లేక తిండి లేకే పరిస్థితుల్లో గల్ఫ్‌కు పంపిస్తారు. ఇలా యువకులు అప్పులలో మునిగి, కొందరు మత్తు...