జీతాలపై కొత్త కార్మిక చట్టాల ప్రభావం..

న్యూఢిల్లీ, నవంబర్‌ 24,మనప్రజాప్రతినిధి:దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగుల జీతభత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగం వరకు, శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీడియా, కర్మాగారాలు, తోటల రంగాల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కొత్త విధానాల ప్రకారం ఉద్యోగుల మొత్తం వేతనంలో కనీసం సగం వరకు మౌలిక జీతంగా ఉండేలా కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అనేక సంస్థలు మౌలిక జీతాన్ని తక్కువగా ఉంచి, అలవెన్సుల రూపంలో...