manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 8:58 am Editor : Mana Praja Prathinidhi

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మనప్రజాప్రతినిధి/
రాజన్నసిరిసిల్ల
నవంబర్,18:

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేద్కర్ నగర్ యూపీహెచ్ సీల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు,ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు.
వైద్య సేవలకు వచ్చిన రోగులతో మాట్లాడారు. ఏ ఏ పరీక్షలు చేశారు? వైద్యం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.  సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఇక్కడ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.