manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 9:14 am Editor : Mana Praja Prathinidhi

రానున్న స్థానిక ఎన్నికల్లో. గెలుపు గాని మన్నికైన పాలన బిఆర్ఎస్ స్వంతం..

ఇర్కోడ్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మా రెడ్డి రవీందర్ రెడ్డి పిలుపు

పార్టీల కోసం కాదు… ప్రజల కోసం పని చేయాలి”అభివృద్ధి చేయడానికి ముందుండాలి.అది బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం..అని మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు
మన ప్రజాప్రతినిధి// –సిద్ధిపేట రూరల్
రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలని మాజీ సుడా చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మా రెడ్డి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇర్కోడ్ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసిందని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ మాటల ప్రభుత్వంగా మారిందని, “చెప్పేది కొండంత – చేసేది అవిస గింజంత” అని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నదని విమర్శించారు.ఇర్కోడ్ గ్రామంలో ఈసారి ఎస్సీ సాధారణ రిజర్వేషన్ వచ్చిన నేపథ్యంలో, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సమయంలో కాదు… ముందుగానే ఒకరినొకరు మాట్లాడుకుని సామరస్యంతో నిర్ణయం తీసుకోవడం మంచిదని మారెడ్డి రవీందర్ రెడ్డి సూచించారు.అలాగే అవసరంలేని గొప్పలు, ప్రదర్శనలు చేసి పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టి తర్వాత ఇబ్బందులు పడకండని అభ్యర్థులను హెచ్చరించారు. ప్రజా మేలు దృష్టిలో ఉంచుకుని శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు.ఎన్నికల సమయంలో అసాంఘిక చర్యలు, అక్రమ పద్ధతులు ఎట్టి పరిస్థితుల్లో చేపట్టరాదని, ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ బిఆర్ఎస్ నాయకులు, కులసంఘాల పెద్దలు.గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.