ఇండియన్ యానిమేషన్‌కు ఆస్కార్ దాకా ప్రయాణం.. <br>– మహావతార్ నరసింహా సరికొత్త చరిత్ర

హైదరాబాద్‌, నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:యానిమేషన్ రంగంలో భారత దేశానికి గర్వకారణంగా మారుతున్న ‘మహావతార్ నరసింహా’ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా సంచలనం సృష్టిస్తోంది. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. పౌరాణికతకు ఆధునిక యానిమేషన్ టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన సంపాదించింది.కేవలం ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లు...