manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 12:29 pm Editor : Mana Praja Prathinidhi

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మనప్రజాప్రతినిధి//

సిద్దిపేట, నవంబర్ 26:
ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) సిద్దిపేట కో-ఎడ్యుకేషన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు–కర్తవ్యాలపై అవగాహన పెంపు లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ“ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించే మహత్తర పత్రం భారత రాజ్యాంగం. దేశ అభివృద్ధిలో ప్రతి సచేతన పౌరుడి పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా యువత రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని తెలిపారు.అదే విధంగా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించిన ప్రిన్సిపాల్, 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు.తదుపరి ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ ఆఫీసర్ దర్పల్లి నగేష్ మాట్లాడుతూ
“రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు అమోఘం. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత సమగ్ర రాజ్యాంగం. పౌరుల హక్కులు, సమానత్వం, న్యాయం కోసం రూపొందిన ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ, విద్యార్థుల ప్రసంగాలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏజీ ఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్ రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ ఫాతిమా, స్పోర్ట్స్ ఇంచార్జి అశోక్, కోచ్ వెంకటేష్, అధ్యాపకులు వెంకటరమణ, గంగాధర్, ప్రసాద్, విజయభాస్కర్, రాజశేఖర్, రఘురాజ్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, బేతి శ్రీనివాస్, సత్యనారాయణ, అఖిల్, రవి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.