ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మనప్రజాప్రతినిధి// సిద్దిపేట, నవంబర్ 26:ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) సిద్దిపేట కో-ఎడ్యుకేషన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు–కర్తవ్యాలపై అవగాహన పెంపు లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ“ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించే మహత్తర పత్రం భారత రాజ్యాంగం. దేశ అభివృద్ధిలో ప్రతి సచేతన పౌరుడి పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా యువత రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టి...