అంధ మహిళా క్రికెట్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

కోలంబో, నవంబర్‌ 23,మనప్రజాప్రతినిధి:ప్రపంచ అంధ మహిళల క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా నిర్వహించిన అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆది నుంచి చివరి వరకు అద్భుత ఆటతీరుతో అదరగొట్టి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. కొలంబోలోని సరా ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో నేపాల్‌పై ఘనవిజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. క్రమశిక్షణతో బంతులు విసిరిన భారత బౌలింగ్ యూనిట్...