భారత అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ మాహె ప్రవేశం
శత్రు జలాంతర్గాములను వేటాడేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న యుద్ధనౌక80% స్వదేశీ సాంకేతికతతో నిర్మాణం – ఆత్మనిర్భర్ భారత్‌కు నూతన మైలురాయితీర ప్రాంత రక్షణలో భారత నౌకాదళానికి భారీ బలంన్యూఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి): భారత నౌకాదళం శత్రు జలాంతర్గాములను వేటాడే నూతన తరం యుద్ధనౌక ఐఎన్ఎస్ మాహెను అధికారికంగా తన అమ్ములపొదిలోకి చేర్చుకుంది. తీర ప్రాంతాల్లో లోతు తక్కువ నీటిలో సైతం అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్లు చేపట్టగలిగే ఈ యాంటీ–సబ్‌మెరైన్ షాలో-వాటర్ క్రాఫ్ట్ రాకతో భారత తీర రక్షణ సామర్థ్యం భారీగా పెరగనుంది. దీనిని నేవీ...