మన ప్రజా ప్రతినిధి,// కొండపాక (కుక్కునూరుపల్లి) మండలం
కుక్కునూరుపల్లి పోలీసులు అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి భారీ పరికరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నర్సింలు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.హైదరాబాద్‌కు చెందిన ఎండి రహీం, జగిత్యాల జిల్లాకు చెందిన నరసింహ, రిషబ్ కలిసి వాహనాలకు అమర్చిన బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దొంగిలించిన బ్యాటరీలను ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఎండీ యాకూబ్, మహమ్మద్ అల్తాఫ్, మహమ్మద్ మీనాజ్‌లకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.ఇటీవలమెదక్,సిద్దిపేట,వరంగల్,యాదాద్రి–భువనగిరి, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో జరిగిన వరుస బ్యాటరీ దొంగతనాల కేసులను విచారించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ముద్దాపూర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాటు చేసినముహూర్త ఆపరేషన్‌లోరహీంనుఅదుపులోకితీసుకోగా,మరోఇద్దరునిందితులుపరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.నిందితుల వద్ద నుంచి మొత్తం 40 వాహన బ్యాటరీలు, రూ.6లక్షలనగదు,దొంగతనాలకుఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై 20కి పైగాకేసులు నమోదైనట్టు ఏసీపీ నర్సింలు వెల్లడించారు.పోలీసులు పరారీలోఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.