అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత<br>40 బ్యాటరీలు, రూ.6 లక్షల నగదు స్వాధీనం — దొంగతనాలకు ఉపయోగించిన వాహనాల జప్తు<br>విలాసాల కోసం దొంగతనాలు చేసినట్లు నిందితుల అంగీకారం

మన ప్రజా ప్రతినిధి,// కొండపాక (కుక్కునూరుపల్లి) మండలంకుక్కునూరుపల్లి పోలీసులు అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి భారీ పరికరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నర్సింలు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.హైదరాబాద్‌కు చెందిన ఎండి రహీం, జగిత్యాల జిల్లాకు చెందిన నరసింహ, రిషబ్ కలిసి వాహనాలకు అమర్చిన బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దొంగిలించిన బ్యాటరీలను ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఎండీ యాకూబ్, మహమ్మద్...