manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 9:00 am Editor : Mana Praja Prathinidhi

తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఆవుల పోతురాజుకు ఆహ్వానం

మనప్రజాప్రతినిధిన్యూస్//సత్తుపల్లి, నవంబర్18:

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధి,నాన్నే నాహీరో పుస్తక రచయిత ఆవుల పోతురాజుకు హైదరాబాదు తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఆహ్వానం అందింది. ఈ వివరాలను గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, తెలుగు ఉపాధ్యాయిని ఎం.రమాదేవి వెంకటాచార్యులు మంగళవారం పత్రికలకు తెలియచేసారు. ఈనెల(నవంబర్) 23వ తేదీన హైదరాబాదు లోని సారస్వత పరిషత్తులో కోడూరి శాంతమ్మ స్మారక బాలల సాంస్కృతికోత్సవం నిర్వహిస్తున్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,డాక్టర్ జె.చెన్నయ్యల ఆధ్వర్యంలో జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవంలో డాక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు,పద్మభూషణ్ డాక్టర్ కెవీ.వరప్రసాదరెడ్డి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు కెవీ.రమణాచారి తదితరులు అతిధులుగా పాల్గొంటున్నారు.ఈ బాలల సాంస్కృతికోత్సవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది బాలలను అతిధులుగా ఆహ్వానించారు.సత్తుపల్లి నుండి బాల అతిధిగా పాల్గొనాలని ఆవుల పోతురాజు పేరును ఆహ్వాన పత్రంలో ప్రచురించారు.తాను రాసిన కధల పుస్తకం నాన్నే నాహీరో పుస్తక నేపధ్యాన్ని వివరిస్తూ సదస్సులో ఆవుల పోతురాజు ప్రసంగిస్తారు.నేను సదస్సులో పాల్గొంటున్నాను ఆవుల పోతురాజు.నన్ను బాలల సాంస్కృతికోత్సవంలో పాల్గొనాలని కోరుతూ సారస్వత పరిషత్తు వారు పంపిన ఆహ్వానం అందింది. ఇది నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.బాల అతిధిగా ఈ సదస్సులో మన సత్తుపల్లి ప్రాంతం నుండి పాల్గొంటాను.