తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఆవుల పోతురాజుకు ఆహ్వానం

మనప్రజాప్రతినిధిన్యూస్//సత్తుపల్లి, నవంబర్18: ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధి,నాన్నే నాహీరో పుస్తక రచయిత ఆవుల పోతురాజుకు హైదరాబాదు తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఆహ్వానం అందింది. ఈ వివరాలను గార్లపాటి-బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు రామకృష్ణ, మధుసూదన రాజు, తెలుగు ఉపాధ్యాయిని ఎం.రమాదేవి వెంకటాచార్యులు మంగళవారం పత్రికలకు తెలియచేసారు. ఈనెల(నవంబర్) 23వ తేదీన హైదరాబాదు లోని సారస్వత పరిషత్తులో కోడూరి శాంతమ్మ స్మారక బాలల సాంస్కృతికోత్సవం నిర్వహిస్తున్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,డాక్టర్ జె.చెన్నయ్యల ఆధ్వర్యంలో జరిగే ఈ సాంస్కృతిక ఉత్సవంలో డాక్టర్...