క్రెడిట్‌ కార్డు వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తేనే లాభం..

- లేకపోతే అప్పుల ఊబిలో మునిగిపోవాల్సిందేహైదరాబాదు, నవంబర్‌ 24,మనప్రజాప్రతినిధి:నేటి కాలంలో క్రెడిట్‌ కార్డు ప్రతి ఇంట్లోనూ అవసరంగా మారిపోయింది. ఒక్క కార్డు చేతిలో ఉంటే చాలు అన్నట్టుగా సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ దానిపై ఆధారపడుతున్నారు. అయితే సరిగ్గా వాడితే అదే కార్డు వరంగా మారుతుంటే, అశ్రద్ధగా వాడితే అదే శాపంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేకుండా ఖర్చులు చేసి, బకాయిలు సమయానికి చెల్లించకపోతే చిన్న మొత్తం కూడా భారీ అప్పుగా మారి గుండెల మీద భారంగా మారే పరిస్థితి...