manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 8:02 am Posted by : Mana Praja Prathinidhi

మా అన్న రాయుడును చంపింది కోట వినుత  దంపతులే..

ప్రజాప్రతినిధి//రేణిగుంట, నవంబర్24:

మాజీ నియోజకవర్గం జనసేన ఇంచార్జి వినుత కోట మాజీ కారు డ్రైవర్ మా అన్న రాయుడును చంపింది కోట వినుత  దంపతులే.. ! అని రాయుడు సోదరి కీర్తి ప్రియా వీడియో ద్వారా వెల్లడించ్చింది. తాము వారిని కలిసినప్పుడు తాము లక్షలు వెచ్చించి రాయుడు మొబైల్ లో వున్నా డిలీట్ మెస్సేజ్ లను వెలికి తీసామని చెప్పడం జరిగిందన్నారు. అయితే వినుత వాళ్ళే ఏఐ వీడియోలు మార్పింగ్,ఎడిట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, రాయుడు హత్యకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదు అన్నారు.అంతే కాకుండా తమకు ఎవ్వరైనా సహాయం చేసి తన అన్న రాయుడు హత్యకేసులో వున్న నిజా నిజాలు తెలియజేయాలని వీడియో ద్వారా మీడియా ముందు రాయుడు చెల్లి కీర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు..