ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలో ఆధునిక డిజైన్లతో, అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కుషాల్ జ్యువెలరీ షోరూంను బుధవారం ప్రముఖ నేత తలపా దామోదరం రెడ్డి రిబ్బన్ కట్టి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆభరణాలు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందకరమని, ఇలాంటి వ్యాపార ప్రాజెక్టులు స్థానిక అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. కొత్త షోరూం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.ప్రారంభోత్సవానికి పెద్దలు కామేష్ యాదవ్, చంద్రశేఖర్ పాలుపంచుకుని యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. షోరూం నిర్వహకులు కస్టమర్ సంతృప్తినే ముఖ్య లక్ష్యంగా తీసుకుని ఉత్తమమైన సేవలు అందిస్తామని తెలిపారు.కార్యక్రమానికి పట్టణ వ్యాపారులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. కొత్తగా ప్రారంభమైన ఈ జ్యువెలరీ షోరూం పట్ల ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.