ఆదర్శ విద్యానికేతన్ E/M స్కూల్‌లో స్థానిక స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ
సిద్దిపేట జిల్లా.మనప్రజాప్రతినిధి//నవంబర్ 29సిద్దిపేట జిల్లా ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం (E/M) స్కూల్‌లో స్థానిక స్వపరిపాలన దినోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతా భావం, పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒక రోజు పాటు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ మరియు పాఠశాల సిబ్బంది పాత్రలను స్వీకరించి బాధ్యతలు నిర్వర్తించారు.విద్యార్థులు ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్లు, డిసిప్లిన్ ఇన్‌చార్జ్, అసెంబ్లీ నిర్వహణ వంటి బాధ్యతలను చేపట్టి రోజువారీ పాఠశాల పనులను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థులు చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ పాఠశాల...