దళిత మహిళలను అడ్డుపెట్టుకుని దాడి చేయించిన వ్యక్తి అరెస్ట్

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకొని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న ఓ వ్యక్తి  దళిత మహిళలను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తిపై దాడి చేయించిన వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.... దుద్దెడ గ్రామానికి చెందిన దోమల ఐలయ్య అలియాస్ అరుణ్ యాదవ్ అదే గ్రామానికి చెందిన జక్కుల రాజు అనే వ్యక్తిపై కక్ష కట్టాడు. ఎలాగైనా రాజు పై పోలీసు కేసు అయ్యేలా, గ్రామంలో అతని పరువు పోయేలా చేయాలని...