manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 3:35 am Editor : Mana Praja Prathinidhi

కాంగ్రెస్ నాయకుని ప్రార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి

మెదక్ జిల్లా(మనప్రజాప్రతినిధి నంబర్:17)

అల్లాదుర్గం మండలం సిల్వర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యర నరసింహారెడ్డి మృతి చెందారు. నరసింహారెడ్డి మరణ వార్తను తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ  సిల్వర్   గ్రామానికి చేరుకొని నరసింహారెడ్డి ప్రార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ మండలంలో నరసింహారెడ్డి మంచి కాంగ్రెస్ నాయకుని కోల్పోయామని ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నరసింహారెడ్డి సిల్వర్ గ్రామం నుండి ఎంపీటీసీగా గెలుపొంది ఎనలేని సేవలు  అందించారని అన్నారు. పిఎసిఎస్ వైస్ చైర్మన్గా ఎన్నికై కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకటే పార్టీ ఒకటే జెండా అన్నట్లు నరసింహారెడ్డి ప్రజలకు సేవలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. నరసింహారెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్బాత్ని ఆయన చేసిన సేవలు ప్రజల్లో ఎప్పుడు గుర్తుంటాయని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషారెడ్డి,అంజా గౌడ్,  సంగమేశ్వర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.