manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 6:49 am Editor : Mana Praja Prathinidhi

నాగురం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్.

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట భూంపల్లి, నవంబర్ 23:

అక్బర్ పేట భూంపల్లి మండలం నాగురం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలపంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షులు , నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు.గజాబింకర్ అశోక్. మాట్లాడుతూ..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాలు దేశ ప్రధానిగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములు పంచడంతోపాటు అనేక సంస్కరణలు చేపట్టిన ఉక్కు మహిళ, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ పేరుపైన తెలంగాణలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందజేస్తుంది అని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారే కానుక అందజేసినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసి అక్బర్, సిఏ పాతూరు స్వప్న, పంచాయతీ సెక్రెటరీ మౌనిక సి సి అక్బర్ సి ఏ విజయ, అందె రాజిరెడ్డి , కిషన్ సెల్ దుబ్బాక అధ్యక్షులు.రవీందర్ రెడ్డి కాంగ్రెస్ సినీయర్ నాయకులు, రామలు సంతోష, కమలవ్వా, రోజా      ఎల్లవ్వ, సంధ్యారాణి, లక్ష్మి, సౌందర్య, బలవ్వా,పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.