మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట,నవంబర్ 16:రిపోర్టర్ అంజి.
సిద్దిపేట: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పత్రికారంగం ప్రాముఖ్యతను వెలికి తీస్తూ ప్రత్యేకంగా స్పందించారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకే సమాజంలో మార్పుకు మూలమని వారు పేర్కొన్నారు.
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా న్యాయం కోసం ముందడుగు వేస్తూ, సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చే శక్తి పత్రికారంగమిదేనని వారు అభిప్రాయపడ్డారు. సమస్యలను ఎండగడుతూ, గొంతుతో–కలంతో ప్రజలను చైతన్యపరచడం జర్నలిస్టుల ప్రధాన ధ్యేయమని తెలిపారు.నిజాన్ని నిర్భయంగా చెప్పడం, పేదలకు అభయంగా నిలవడం, నిజాన్నే ఆయుధంగా మలచుకొని పని చేయడమే జర్నలిజం నైజమని వారు గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రధాన స్థంభంగా మీడియా వ్యవహరిస్తోందని మరోసారి స్పష్టం చేశారు.జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపుకున్నారు..