గుండ్లపల్లి నరేష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఆజాద్ యూత్ సభ్యులు.

మనప్రజాప్రతినిధి//(తిరుమలగిరి, నవంబర్15:) తిరుమలగిరి మండలం పరిధిలోని తొండ గ్రామంలో  దసరా రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన గుండ్లపల్లి నరేష్ కుటుంబానికి  ఆజాద్ యూత్ సభ్యులు నరేష్ సతీమణికి  34 వేల రూపాయలు అందించడం జరిగింది.  గుండ్లపల్లి నరేష్ కు భార్య,కుమారుడు, కూతురు ఉన్నారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ నరేష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ కూడా ఆజాద్ యూత్ సభ్యులను  అభినందించారు.